ఏపీలో కరోనా ఉగ్రరూపం

ఏపీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,558 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 465, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 37 కేసులు వెలుగుచూశాయి. తాజాగా నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 9,15,832కి కరోనా కేసులు చేరాయి. కొవిడ్‌తో గుంటూరు, కష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 7,268 మరణాలు సంభవించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,53,33,851 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 8,93,651 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కాగా ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ కొరత ఆరోగ్యశాఖను తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రానికి సరిపడా డోస్‌లు ఇప్పటికిప్పుడు ఇవ్వలేమంటూ కేంద్రం కూడా చేతులెత్తేసింది. దీంతో మొదటి డోస్‌ వేయించుకున్న వారికి రెండో డోస్‌ అందుతుందో, లేదో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో మూడు రోజుల్లో అవీ పూర్తవుతాయి.

Thanks! You've already liked this