ఘనంగా గురుతేజ్‌ బహదూర్‌ 400వ జయంతి

దిల్లీ : గురు తేజ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోదీ తెలిపారు. జయంతి ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం ప్రధాని నేతృత్వంలో జిరిగింది. ఈ ఉత్సవాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గురు తేజ్‌ బహదూర్‌ ప్రవచనాలతో పాటు సిక్కు సంస్కృతి తెలియజేయాలని మోదీ అన్నారు. గురు నానక్‌ 550వ జయంతి, గురుతేజ్‌ బహదూర్‌ 400వ జయంతి, గురు గోవింద్‌ సింగ్‌ 350వ జయంతి ఉత్సవాలను నిర్వహించే అవకాశం తమ ప్రభుత్వానికి దక్కినందుకు ఆనందంగా ఉందని మోదీ అన్నారు. డిజిటల్‌ ద్వారా యువతకు ఈ కార్యక్రమాలు చేరవయ్యేలా చూడాలని కోరారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, హరియాణా, పంజాబ్‌ ముఖ్యమంత్రులతో పాలు మరికొంతమంది ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Thanks! You've already liked this