జమ్మూ విమానాశ్రయంలో ఉగ్రవాద అనుమానితుడి అరెస్టు

జమ్మూ : జమ్మూ-కశ్మీర్‌ పూంచ్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు, మత్తుమందుల తరలింపుతో సంబంధం ఉన్న షాహిద్‌ నవీద్‌ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ గురువారం అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. జమ్మూ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నామని, ఉగ్రవాదుల చొరబాటుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న షేర్‌ అలీకి షాహిద్‌ ముఖ్య అనుచరుడని అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 17న అలీని అరెస్టు చేయగా, విచారణలో షాహిద్‌ పేరు బయటకు వచ్చిందని, గల్ఫ్‌ దేశం నుంచి అతడని భద్రతతో భారత్‌కు తీసుకువచ్చి ఎన్‌ఐఏకు అప్పగించామని అధికారులు వివరించారు.

Thanks! You've already liked this