బీజేపీ అభ్యర్ధిగా ములాయం బంధువు

మొయిన్‌పూర్‌ : సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ సోదరుని కుమార్తె, మాజీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌ సోదరి సంధ్యా యాదవ్‌ బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్‌లో జిల్లా పంచాయితీ సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. మొయిన్‌పూర్‌ జిల్లా పంచాయత్‌ అధ్యక్షురాలిగా సంధ్యా యాదవ్‌ 2015లో సమాజ్‌వాదీ పార్టీ తరపున గెలిచారు. 2017లో పార్టీని వీడి బీజేపీలో చేరగా, బుధవారం మెయిర్‌పూర్‌ 18వ వార్డులో నామినేషన్‌ వేసినట్టు అధికారులు వివరించారు.

Thanks! You've already liked this