రోహింగ్యాల బలవంతపు తరలింపు వద్దు: సుప్రీం
దిల్లీ : జమ్మూ-కశ్మీర్లో పట్టుబడ్డ రోహింగ్యాలను సరైన విధానం అమలుపరచకుండా బలవంతంగా మైన్మార్ తరలించవద్దని సుప్రీం కోర్టు గురువారం తెలిపింది. జమ్మూలోని రోహ్యింగా శరణార్ధులను వెంటనే విడుదల చేసి వారిని మైన్మార్ పంపాలన్న పిల్‌పై సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పిటీషనర్ తరపున వాదించిన ప్రశాంత్ భూషన్, రోహింగ్యాలు మైన్మార్ సైన్యం చేతిలో చిత్రహింసలకు గురయ్యారని, వారి దాడుల నుంచి తప్పించుకునేందుకు భారత్, బంగ్లాదేశ్‌లోకి అక్రమంగా వచ్చారని అన్నారు. అయితే కేంద్రం ఈ పిటీషన్న్ని వ్యతిరేకిస్తూ దేశం అక్రమ వలసదారులకు నివాసం కాదని తేల్చి చెప్పింది.