రమణదీక్షితుల కామెంట్స్ కు చంద్రబాబు కౌంటర్

చంద్రబాబు

రమణదీక్షితుల కామెంట్స్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడని చంద్రబాబు అన్నారు. ఇటీవల రమణ దీక్షితులు జగన్ ను విష్ణు అవతారంతో పోల్చిన సంగతి తెలిసిందే. దీనిపై పరోక్షంగా చంద్రబాబు రమణదీక్షితుల వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పింక్ డైమండ్ మాయం అయిందని ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్లీ నియమించడం సరికాదని చంద్రబాబు అన్నారు. దీనివల్ల హిందువల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. తాను శ్రీవారి పాదల చెంత పుట్టడం పూర్వజన్మసుకృతమని చంద్రబాబు అన్నారు.

The post రమణదీక్షితుల కామెంట్స్ కు చంద్రబాబు కౌంటర్ appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this