అమెరికా స్థాయిలో భారత్ లో నమోదవుతున్న కరోనా కేసులు

భారత్

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 1,26,789 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 685 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,29,28,574 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,66,862 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 9,10,319 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,18,51,393 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కరోనా దేశంలోకి ప్రవేశించాక ఈరోజే అత్యధిక కేసులు నమోదయ్యాయి.

The post అమెరికా స్థాయిలో భారత్ లో నమోదవుతున్న కరోనా కేసులు appeared first on తెలుగు పోస్ట్.

Thanks! You've already liked this