భవిష్యత్తు లేదని అర్థమై ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారు

కేసీఆర్‌పై ఈటల మండిపాటు
కేసీఆర్‌ తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, భవిష్యత్తు లేదని అర్థమై ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.
సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదన్నారు. సింగరేణిలో 63 వేల ఉద్యోగుల నుంచి 43 వేల ఉద్యోగులకు తగ్గారన్నారు. అయినా ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారని ఆయన తెలిపారు.3500 కోట్ల మిగులుతో ఉన్న సింగరేణి, రూ.8 వేల కోట్ల అప్పుల పాలైందన్నారు. ధరణి వెబ్సైట్‌ తెలంగాణ రైతాంగానికి శాపంగా మారిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న భూదాన్‌, ల్యాండ్‌ సీలింగ్‌ భూములపై ప్రభుత్వం కన్ను పడిరదన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భూములను గుంజు కుంటూ, ప్రైవేట్‌ వ్యక్తులకు, కంపెనీలకు అమ్ముతూ ప్రభుత్వం కూడా బ్రోకర్‌ పని చేస్తోందంటూ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు.

The post భవిష్యత్తు లేదని అర్థమై ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారు first appeared on విశాలాంధ్ర.

Thanks! You've already liked this