అద్భుత కళాఖండాలతో ఊహాలోకంలోకి తీసుకెళ్తున్న అనగనగా.!

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : అనగనగా అనగానే అమ్మమ్మతో గడిపిన ఆ జ్ఞాపకాల దొంతరలోకి జారిపోయే వారెందరో ! ఈ చిన్ననాటి మధురస్మృతులు, ఆ కథలలో పసిహృదయాలపై చెరగని ముద్ర వేసిన కామధేనువు మొదలు ఐరావతం, గండ బేరుండ పక్షి, బ్రహ్మాస్త్రం ఇలా అంశాలకు ఓ రూపమిచ్చి వినూత్న ప్రదర్శనకు తెరతీశారు శ్రీనివాసబాబు అంగర. చిత్రకారుడు, ఆర్కిటెక్ట్ గా సుపరిచితులైన ఆయన కంటెంపరరీ ఆర్ట్‌పై తనదైన నైపుణ్యం ప్రదర్శిస్తూ ఇత్తడితో రూపొందించిన కళాఖండాలను అనగనగా శీర్షికన ప్రదర్శిస్తున్నారు. హైదారాబాద్‌లోని హైటెక్స్‌ సమీపంలో ఖానామెట్‌ వద్దనున్న గ్యాలరీ 78లో ఈ ప్రదర్శన ప్రారంభమైంది. మే18వ తేదీ వరకూ జరిగే ఈ ప్రదర్శనలో యాంటిక్‌ లుక్‌లో తీర్చిదిద్దిన కళాఖండాలను ప్రదర్శించనున్నారు.

ఈ సిరీస్‌లో శ్రీనివాస బాబు తన చిన్నతనంలో విన్న కథల్లో తన మనసుపై చెరగని ముద్ర వేసిన వస్తువులు, జంతువులు, పక్షులు, ఊహాతీత శక్తుల స్ఫూర్తితో ఈ కళాఖండాలను రూపొందించారు. అతి సరళమైన జ్యామెట్రిక్‌ ఆకృతుల్లో అబ్‌స్ట్రాక్డ్‌ రూపంలో వీటిని తీర్చిదిద్దారు. జెఎన్‌టీయు హైదరాబాద్‌లో బ్యాచులర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌లో గోల్డ్‌మెడలిస్ట్‌ అయిన శ్రీనివాస్‌బాబు, క్రియేటివ్‌ ఇన్‌స్టింక్ట్స్‌ పేరిట ఆర్కిటెక్చర్‌, ఆర్ట్‌, రూపొందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Thanks! You've already liked this