2024లో కేజీఎఫ్3 రిలీజ్-ట్వీట్ చేసిన నిర్మాణ సంస్థ‌

2024లో కేజీఎఫ్3 చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. కాగా కేజీఎఫ్’ రెండో పార్ట్ చివరిలో ఈ మూవీకి మరో సిక్వెల్ రాబోతుందనే దర్శకుడు ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ పార్ట్ 3పై తాజాగా కారిటీ ఇచ్చారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో భారీ చిత్రం ‘సలార్’ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ షూటింగ్ పై అప్డేట్ అందిస్తూ ‘Kgf Chapter 3’పైనా క్లారిటీ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. ‘ప్రశాంత్ నీల్ సలార్‌ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఇప్పటికే 35 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. అక్టోబర్ లేదా నవంబర్ నాటికి షూటింగ్ పార్ట్ పూర్తి కావచ్చు. 2024లో సలార్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. ఈ చిత్ర విడుదలతోనే KGF3 షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నాం. ఈ సీక్వెల్ ను మార్వెల్ లాగా అద్భుతంగా రూపొందించనున్నాం అన్నారు.

Thanks! You've already liked this