బాలికపైకి దూసుకెళ్లిన వాహనం.. అగ్గిపెట్టి, డ్రైవర్‌ను ఆ మంటల్లోకే తోసేసిన జనం

ఒక వాహనం ఆరేళ్ల బాలికపైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఆ చిన్నారి అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. దీంతో ఆగ్రహించిన జనం ఆ వాహనానికి నిప్పు పెట్టారు. డ్రైవర్‌ను కొట్టి అదే మంటల్లోకి తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడు హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుదూ చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి బర్ఝర్ క్రాసింగ్‌ వద్ద ఒక పికప్ వాహనం ఆరేళ్ల బాలిక‌పై దూసుకెళ్లగా ఆ పాప మరణించింది.

దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ వాహనానికి నిప్పుపెట్టారు. 43 ఏళ్ల డ్రైవర్‌ మగన్ సింగ్‌ను దారుణంగా కొట్టారు. మంటల్లో కాలుతున్న వాహనం మీదకు అతడిని తోసేశారు. దీంతో తీవ్ర గాయాలైన ఆ డ్రైవర్‌ను మెరుగైన చికిత్స కోసం గుజరాత్‌లోని దాహోద్ ఆస్ప‌త్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం అతడు చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు. కాగా, ఈ ఘటనపై అలీరాజ్‌పూర్ పోలీసులు స్పందించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Thanks! You've already liked this