నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

మరిపెడ (ప్రభ న్యూస్): నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అగ్రికల్చర్ అసిస్టెంట్ కమిషనర్ ఉషా రాణి, టాస్క్ ఫోర్స్ డిఎస్పీ బి రామనుజం హెచ్చరించారు. శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని పెర్టిలైజర్, గోదాముల్లో టాస్క్ఫోర్స్, అగ్రికల్చర్, పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పత్తి విత్తనాల నమూనాలు పరక్షించారు. మరిపెడల ఉన్న గోదాములను, షాపుల లైసెన్సు, రికార్డ్, స్టాక్ పరిశీలించారు. రైతులు అయోమయానికి గురి కాకుండా స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. బిల్లులు, స్టాక్ మెంటేనెన్సు తప్పని సరిగా పాటించాలన్నారు. కాగా, తనిఖీల్లో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Thanks! You've already liked this