నిల‌క‌డ‌గా బంగారం, వెండి ధరలు.. ఈ వారంలో వెయ్యి త‌గ్గింపు

బంగారం కొనాల‌నుకునే వారికి గుడ్‌న్యూస్‌.. గత రెండు రోజులుగా త‌గ్గుతున్న బంగారం ధరలు ఇవ్వాల స్థిరంగా ఉన్నాయి. ఈ వారంలో బంగారం ధర దాదాపు వెయ్యి రూపాయలకు పైనే తగ్గింది. అయితే ఆదివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,250గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,450గా ఉంది. కాగా, సోమ‌వారం కూడా బంగారం ధరలో ఎలాంటి వ్య‌త్యాసం లేదు. అదే రేట్లు కొన‌సాగుతున్న‌ట్టు బులియ‌న్ మార్కెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇక‌.. వెండి ధర కూడా ఇవ్వాల స్థిరంగానే ఉంది.. కిలో వెండి ధర రూ.63,700గా న‌మోదైంది. ఏపీలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Thanks! You've already liked this