అకాల వర్షానికి తడిసిన వడ్ల కుప్పలు.. పెద్ద ఎత్తున నష్టపోయిన రైతులు

ఎల్లారెడ్డి, (ప్రభ న్యూస్) : అకాల వర్షాలతో కామారెడ్డి జిల్లాలో కల్లాల్లో ఆరబోసిన వడ్లన్నీ నీట తడిశాయి. దీంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లనుంది. కాగా, ఎల్లారెడ్డి మండల సబ్ధల్ పూర్, మల్లయ్య పల్లి కొనుగోలు సెంటర్లను ఇవ్వాల (సోమవారం) ఉదయం ఎల్లారెడ్డి సొసైటీ డైరెక్టర్ నాగం గోపికృష్ణ పరిశీలించారు. ఆయా వడ్ల కొనుగోలు సెంటర్లలో ఆరబోసిన ధాన్యం కుప్పలు అకాల వర్షానికి తడిచిపోయాయని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తూకం వేసిన వరి ధాన్యం బస్తాలు కూడా వర్షానికి తడిసి పోయాయని, ఇప్పటికైనా కొనుగోలు సెంటర్లలో లేట్​ చయకుండా త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. అంతేకాకుండా వడ్ల బస్తాలను రైస్ మిల్లులకు వెంటవెంటనే తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Thanks! You've already liked this