జగిత్యాల జిల్లాలో భారీ వర్షం.. హైవేపై విరిగిప‌డ్డ చెట్లు

తెలంగాణ‌లోని జగిత్యాల జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున‌ చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వర్షం, ఈదురు గాలులతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులతో మామిడితోట‌ల‌కు భారీ న‌ష్టం వాటిళ్లింది. మామిడి నేల రాల‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. వర్షానికి క‌ల్లాల్లో ఆర‌బోసిన వ‌డ్ల రాశులు త‌డిసిపోయాయి.

Thanks! You've already liked this