పెద‌విపై ముద్దు అస‌హ‌జ శృంగార‌మేమీ కాదు.. బాంబే హైకోర్టు తీర్పు

పద్నా‌లు‌గేండ్ల మైనర్‌ బాలుడి పెదా‌లపై ఓ పురు‌షుడు ముద్దా‌డటం అస‌హజ శృంగార చర్య (అ‌న్‌‌నా‌చు‌రల్‌ సెక్స్‌) కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పు‌ని‌చ్చింది. నింది‌తు‌డికి బెయిల్‌ మంజూరు చేసింది. ఆ బాలు‌డిది ముంబై కాగా, గ‌త ఏడాది ఓ షాపుకు వెళ్లి‌న‌ప్పుడు అక్కడ యజ‌మాని బాలుడి పెద‌విపై ముద్దు పెట్టాడు. త‌న మర్మాం‌గా‌లను కూఆ తాకాడు. ఈ విష‌యాన్ని ఆ బాలుడు తండ్రికి చెప్పగా.. అత‌ను పోలీ‌సు‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం, ఐపీసీ 377 సెక్షన్‌ కింద కేసు న‌మోదు చేశారు. దీనిపై జస్టిస్‌ అనూజ ప్రభు‌దే‌శాయ్‌ నేతృ‌త్వం‌లోని ధర్మా‌సనం ఈమ‌ధ్య‌ విచా‌రణ జరి‌పింది. బాలు‌డిపై లైంగిక దాడి జరి‌గి‌నట్టు వైద్య పరీ‌క్షల్లో ఆధా‌రా‌ల్లే‌వని జస్టిస్‌ అనూజ పేర్కొ‌న్నారు.

Thanks! You've already liked this