కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రెండో పెళ్లి – వైర‌ల్ గా ఫొటోలు

సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు దంప‌తులు విడాకుల బాట ప‌ట్ట‌డ‌మే కాదు..మ‌రోసారి పెళ్లిపీట‌లు ఎక్క‌డం ప‌రిపాటే. అదే బాట ప‌ట్టారు త‌మిళ స్టార్ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు డి. ఇమ్మాన్. కాగా ఇమ్మాన్ 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్‌ ఇంజినీర్‌గా పనిచేసే మోనికా రిచర్డ్ ని పెళ్లి చేసుకున్నాడు. తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తింపుగా ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. అయితే అనూహ్యంగా 13 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతూ 2021, డిసెంబర్ 29న విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. కాగా విడాకుల తర్వాత జీవితంలో మరో అడుగు ముందుకు వేయడానికీ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఓ పోస్ట్‌ పెట్టాడు ఇమ్మాన్‌. దీంతో అతను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు పుకార్లు షికార్లు కొట్టాయి. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ రెండోసారి పెళ్లి పీటలెక్కాడు కోలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఉబాల్డ్ కుమార్తె అమేలీతో అతని రెండో వివాహం జరిగింది ..వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నటి సంగీత, సీనియర్ నటి కుట్టి పద్మిని, సింగర్‌ క్రిష్‌ తదితరులు ఇమ్మాన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Thanks! You've already liked this