స‌మంత‌..విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల మూవీ ఖుషీ – డిసెంబ‌ర్ 23న రిలీజ్

ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ మైత్రీబ్యాన‌ర్ తో క‌లిసి ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ గా స‌మంత న‌టిస్తున్నారు. విజయ్ దేవరకొండ – సమంత జోడీ అనేసరికి సహజంగానే అందరిలో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాకి ‘ఖుషి’ అనే టైటిల్ ను ఖరారు చేయడంతో మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ మోషన్ పోస్టర్ ను వదిలారు. విజయ్ దేవరకొండ మోడ్రన్ లుక్ తో కనిపిస్తుంటే, సమంత సంప్రదాయ బద్ధమైన లుక్ తో కనిపిస్తోంది. ఈ ఇద్దరికీ కొంగుముడి వేసిన పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా అప్పుడే ప్రకటించడం విశేషం. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ‘యశోద’ తరువాత సమంత .. ‘లైగర్’ తరువాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ఇది.

Thanks! You've already liked this