సూర్యాపేటలో శ‌ర‌వేగంగా మ‌హాప్ర‌స్థానం ప‌నులు.. హైద‌రాబాద్ త‌ర‌హాలో నిర్మాణం

సూర్యాపేట, ప్రభ న్యూస్: సూర్యాపేట హిందూ శ్మ‌శాన వాటికలో జరుగుతున్న మహాప్రస్థానం పనులను సోమవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వర్లుతో కలిసి సందర్శించారు. శ్మశాన వాటికలో జరుగుతున్న పనులను డీఈ సత్యారావు, ఏఈ సుమంత్ ను అడిగి తెలుసుకున్నారు.

నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ లను పరిశీలించి మహా ప్రస్థానం పనులు శరవేగంగా జ‌ర‌గ‌డంపై అభినందించారు. హైద‌రాబాద్‌లోని మ‌హాప్ర‌స్థానం తరహలో నిర్మించడాన్ని ప్రసంశించారు. త్వరలో మిర్యాలగూడలో కూడా మహాప్రస్థానం నిర్మాణం పనులు చేప‌ట్ట‌నున్న‌ట్టు ఆయ‌న‌ చెప్పారు.

Thanks! You've already liked this