గంగమ్మతల్లికి సారె సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : చిత్తూరు జిల్లా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, త‌న భార్య స్వర్ణమ్మతో క‌లిసి సోమవారం ఉదయం పట్టు చీర, సారె సమర్పించారు. తుడా కార్యాలయం నుంచి సన్నాయి, మేళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వారిని స్వాగతించి, దర్శన ఏర్పాట్లు చేయించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ కట్టా గోపీ యాదవ్, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అమ్మవారి దర్శనానంతరం మీడియా ప్రతినిధులతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్ది ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రం తో పాటు అన్ని ప్రాంతాల ప్రజలకు తెలిసే విధంగా పీఠాధిపతులు, రాజకీయ ప్రముఖులను గంగమ్మ జాతరకు ఆహ్వానిస్తూ, వారిని అమ్మవారి సేవలో పాల్గొనేలా చేస్తున్నారని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి గంగమ్మ ఆలయం ఎంతో ప్రాచీనమైంద‌ని, ఈ ప్రాశస్థ్యాన్ని అందరికీ చాటేలా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంద‌న్నారు.

Thanks! You've already liked this