నారాయ‌ణ లీక్స్‌.. బిడ్డ‌లు, అల్లుడికి మ‌ధ్యంత‌ర బెయిలిచ్చిన హైకోర్టు

అమరావతి: పదో తరగతి పేపర్‌ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడితో పాటు మరో 10 మందికి హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. చిత్తూరు వన్‌ టౌన్‌ ఠాణాలో నమోదైన కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ కుమార్తెలు శరణి, సింధూర, అల్లుడు పునీత్‌తో పాటు విద్యాసంస్థలకు చెందిన మరో 10 మంది సిబ్బంది హైకోర్టును ఆశ్రయించారు.

తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అందరికీ ఈ నెల 18 వరకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. వ్యాజ్యాలపై పూర్తి స్థాయి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది ధ‌ర్మాస‌నం.

Thanks! You've already liked this