రాజ‌స్థాన్ మంత్రి కుమారుడికి స‌మ‌న్లు – 18న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశం

ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ నేత‌,రాజ‌స్థాన్ మంత్రి మ‌హేష్ జోషి కుమారుడికి స‌మ‌న్లు పంపారు. ఓ యువ‌తిపై అత్యాచార ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు స‌ద‌రు మంత్రి త‌న‌యుడు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు. వివాహం చేసుకుంటానని నమ్మించి గతేడాది జనవరి 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17 మధ్య రోహిత్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని జైపూర్‌కు చెందిన 23 ఏళ్ల యువతి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన కుటుంబానికి రోహిత్, ఆయన తండ్రితో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో అతనిని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ నుంచి 15 మంది పోలీసులు నిన్న ఉదయం జైపూర్ వెళ్లారు. అయితే, రోహిత్ లేకపోవడం, అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండడంతో ఆయన ఇంటికి ఈ రోజు సమన్ల కాపీ అతికించారు.

Thanks! You've already liked this