విజయ్- సమంత పింక్ లవ్ స్టొరీ

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకుడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ గత కొన్నిరోజుల నుంచి కశ్మీర్‌లో జరుగుతోంది. తాజాగా సినిమా నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ని అభిమానులతో పంచుకుంది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని సైతం విడుదల చేసింది. ఇందులో విజయ్‌ ఫుల్‌ స్టైలిష్‌ లుక్‌లో.. సామ్‌ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. పోస్టర్‌ని బట్టి చూస్తే ఈ సినిమా కశ్మీర్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. బాంబ్ బ్లాస్ట్ ని కూడా పింక్ కలర్ చూపించడం ఆసక్తికరంగా వుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ ఏడాది డిసెంబర్‌ 23న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిసమ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

The post విజయ్- సమంత పింక్ లవ్ స్టొరీ appeared first on తెలుగు360.

Thanks! You've already liked this