మాజీ మంత్రి గ‌ల్లా అరుణ కీల‌క వ్యాఖ్య‌లు

మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కురాలు గల్లా అరుణకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టేనని వెల్లడించారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ భవనానికి భూమిపూజలో పాల్గొని గల్లా అరుణకుమారి మీడియాతో మాట్లాడారు. తన సంకల్పమే తన భవిష్యత్తన్నారు. తాను చూడని రాజకీయం లేదు.. పదవి లేదన్నారు. రాజకీయ వారసుడిగా తన కుమారుడు కొనసాగుతాడని తెలిపారు. ఏ పార్టీలో భవిష్యత్ ఉంటుందో వాళ్లు అక్కడ ఉండొచ్చన్నారు.

Thanks! You've already liked this