అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ భూమి పూజ
ఇనగలూరులో అపాచీ యూనిట్‌కు శంకుస్థాపన
అమరావతి: సీఎం జగన్ నేడు శ్రీ బాలాజీ జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి పరిధిలోని ఇనగలూరులో అపాచీ పరిశ్రమకు భూమి పూజ చేశారు. రూ.800 కోట్లతో ఇనగలూరులో లెదర్ యూనిట్‌ను నెలకొల్పేందుకు అపాచీ ముందుకు వచ్చింది. తొలి దశలో రూ.400 కోట్ల పెట్టుబడిని పెట్టనున్న ఈ సంస్థ … రానున్న ఐదేళ్లలో మరో రూ.400 కోట్లను పెట్టుబడిగా పెడుతుంది. ఈ యూనిట్లో ఆడిదాస్ షూస్, లెదర్ జాకెట్లు, లెదర్ బెల్టులను అపాచీ తయారు చేయనుంది.
ఈ యూనిట్‌కు భూమి పూజ చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. అపాచీ పరిశ్రమతో కొత్తగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. ఈ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకే దక్కనున్నాయని ఆయన తెలిపారు. 2023 నాటికి ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తుందని జగన్ తెలిపారు.
ఇదిలా ఉంటే… ఈ పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన వకుళామాత ఆలయ ప్రారంభోత్సవంలోనూ జగన్ పాలుపంచుకున్నారు. అనంతరం తిరుపతిలో టీసీఎల్ గ్రూప్‌నకు చెందిన ప్యానెల్ ఆప్టో డిస్ప్లే టెక్నాలజీస్ లిమిటెడ్, డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో టెక్ తదితర కంపెనీలకు భూమి పూజ చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/
The post అపాచీ పరిశ్రమకు సీఎం జగన్ భూమి పూజ appeared first on Vaartha.