ఆత్మకూరులో ప్రశాంతంగా పోలింగ్.. 3గంటల వరకు 55శాతం పోలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మిక మృతితో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈరోజు ఉదయం నుంచి ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. అక్కడ నిర్వహిస్తున్న పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. చెదురుమదురు సంఘటనలు మినహా ఎలాంటి ఘటనలు చోటుచేసుకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం మూడు గంటల వరకు 55 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నాం ఒంటి గంటకు పోలింగ్‌ 44.14 శాతం నమోదు కాగా మరో రెండు గంటల్లో మరో 11 శాతం పోలింగ్‌ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది.

అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలో తన తల్లి మణిమంజరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

Thanks! You've already liked this