ఇంధన కొరతతో అల్లాడుతున్న శ్రీలంక.. పూర్తిగా పతనమైన ఆర్థిక వ్యవస్థ

దేశంలో చమురు నిల్వ పరిస్థితి దృష్ట్యా శ్రీలంక ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు శ్రీలంక పార్లమెంటు వారం సమావేశాలను రద్దు చేసింది. వినాశకరమైన ఆర్థిక సంక్షోభంలో వున్న దేశం ఇప్పటికే ఇంధన సరఫరాలను వేగంగా తగ్గిస్తోంది. క్టిష్టమైన విదేశీ కరెన్సీ కొరత కారణంగా దిగుమతిదారులు ఆహారం, చమురు, ఔషధాల కొనుగోళ్లకు ఆర్థిక సహాయం చేయలేకపోయారు. అనవసర ఇంధన వినియోగాన్ని నివారించేందుకు గురు, శుక్రవారాల్లో సమావేశాలు నిర్వహించకూడదని శాసనసభ్యులు నిర్ణయించుకున్నారని, ఇదే కారణంతో పాఠశాలలు, కొన్ని రాష్ట్ర కార్యాలయాలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఇంధనశాఖ మంత్రి కాంచన విజేశేఖర కొలంబోలో విలేకరులతో మాట్లాడుతూ ”గురువారం రావాల్సిన గ్యాసోలిన్‌ షిప్‌మెంట్‌ రావడం ఆలస్యమైందని, అందుకని వాహనదారులు తమ ప్రయాణాలను తగ్గించుకోవాలని కోరారు. ఈరోజు, రేపు పంపింగ్‌ స్టేషన్లకు పరిమిత మొత్తంలో మాత్రమే పెట్రోల్‌ పంపిణీ చేయబడుతుందని” అన్నారు.

వాహనదారులు ఇప్పటికే ఇంధనానికి రోజుల తరబడి క్యూలలో వేచి ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ‘పూర్తి పతనం’ స్థాయికి చేరుకుందని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే పేర్కొన్నారు. ”మేము ఇప్పడు ఇంధనం, గ్యాస్‌, విద్యుత్‌, ఆహార కొరతకంటే చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని విక్రమసింఘే చెప్పారు. ఏప్రిల్‌లో శ్రీలంక చెల్లించాల్సిన 51 బిలియన్ల విదేశీ రుణాన్ని కట్టలేదు. ఆ నేపథ్యంలో కొన్ని నెలల సమయం కోరుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)తో చర్చలు జరుపుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Thanks! You've already liked this