యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలి.. సీఎం కేసీఆర్

యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జలవిహార్ లో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….మంచి నాయకుడిని తాము రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకున్నామన్నారు. యశ్వంత్ సిన్హాను సమున్నత వ్యక్తిత్వమన్నారు. యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున స్వాగతం పలికామన్నారు. లాయర్ గా, ఐఏఎస్ ఆఫీసర్ గా, రాజకీయ నేతగా యశ్వంత్ సిన్హా ఎదిగారన్నారు. ఆర్థిక, విదేశాంగ శాఖలు యశ్వంత్ సిన్హా సమర్థంగా నిర్వహించారన్నారు.

Thanks! You've already liked this