టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన

సిరిసిల్ల : ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తున్న క్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సుంకపాక మనోజ్ ,కత్తెర వరుణ్ లు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. బై బై మోడీ అంటూ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Thanks! You've already liked this