అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్ లో జాప్యం లేకుండా ప్రతిష్టించాలి : టీడీపీ అధినేత

ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్లో లో జాప్యం లేకుండా ప్రతిష్టించాలని లేఖల్లో కోరారు. అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. అల్లూరిని స్మరించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలో అల్లూరిని చేర్చించినందుకు తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. భీమవరంలో ప్రారంభిస్తున్న అల్లూరి విగ్రహావిష్కరణ ప్రజల మనసులో గుర్తుండిపోతుందని అన్నారు.

Thanks! You've already liked this