తెలంగాణలో వందశాతం అధికారంలోకి వస్తాం.. అనురాగ్ ఠాకూర్

తెలంగాణలో వందశాతం అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదన్నారు. రాష్ట్ర ఖజానా డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ నేషనల్ పార్టీ.. చంద్రబాబు జాతీయ పార్టీలా ఉంటుందన్నారు. కేసీఆర్ లాంటి నాయకులకు ప్రధాని మోడీ గురించి ఏం తెలుసు అని అన్నారు. రూ.2.50లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. అప్పు డబ్బులను కేసీఆర్ కుటుంబానికి తరలించారన్నారు.

Thanks! You've already liked this