ఆమె మరణం ప్రమాదమే.. ఇవానా ట్రంప్‌ మరణంపై మెడికల్‌ రిపోర్టు

డోనాల్డ్‌ ట్రంప్‌ మొదటి భార్య ఇవానా ట్రంప్‌ రెండురోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌ సిటీలోని తన ఇంట్లో ఆమె ప్రాణాలు విడిచారు. అయితే మెట్ల మీద నుంచి క్రింద పడడం వల్ల మరణించినట్లు అనుమానాలున్నాయి. న్యూయార్క్‌ సిటీ మెడికల్‌ ఆఫిసర్‌ ఇవానా మృతిపై రిపోర్ట్‌ ఇచ్చారు. మొండెం భాగానికి బలమైన గాయాలు కావడం వల్లే ఇవానా ప్రాణాలు విడిచినట్టు మెడికల్‌ ఆఫిసర్‌ తన రిపోర్టులో తెలిపారు.

మెట్ల మీద నుంచి కిందపడినట్లు వస్తున్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఎప్పుడు ఈ ఘటన జరిగిందో మెడికల్‌ ఆఫిసర్‌ తన రిపోర్టులో చెప్పలేదు. కానీ ఇవానా ట్రంప్‌ మరణం ప్రమాదమే అని తేల్చారు. మన్‌ హటన్‌ ఉన్న ఇంట్లో 73 ఏళ్ల ఇవానా ట్రంప్‌ మరణించినట్లు గురువారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Thanks! You've already liked this