ట్రైలర్ రిలీజ్ కే 75 అడుగుల కటౌటా?

భారీ అంచనాలు ఉన్న సినిమాలన్ని ఒకటి తర్వాత ఒకటి చొప్పున రిలీజ్ కావటం.. ఒక్కసారి స్తబ్దత వాతావరణం నెలకొని ఉండటం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాల సందడి లేకపోవటం ఎంత లోటన్న విషయం టాలీవుడ్ కు ఇప్పుడు బాగా అర్థమైన పరిస్థితి. కరోనాతో ప్రత్యేక పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తెలుగు ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తికరంగా చూస్తున్న మూవీ లైగర్. విజయ దేవరకొండ నటించిన ఈ మూవీ మీద ఉన్న అంచనాలు అన్ని ఇన్ని కావు.

ఈ సినిమా మీద ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలకు కాస్త ముందుగా హైదరాబాద్ మహానగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద విజయ దేవరకొండకు సంబంధించిన భారీ కటౌట్ ను ఏర్పాటు చేసిన వైనం సందడిగా మారింది. టాలీవుడ్ లో ఇంత మంది హీరోలు ఉన్నప్పటికీ.. ఒక క్రేజీ హీరో మూవీ ట్రైలర్ విడుదలకు ముందే ఇంత హడావుడిని క్రియేట్ చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

మూవీ ట్రైలర్ రిలీజ్ కే ఇంత భారీగా హడావుడి చేస్తే.. ఇక సినిమా విడుదల వేళ మరెంతగా హడావుడి చేస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక.. ఈ భారీ కటౌట్ లో బాక్సర్ అవతారంలో అర్థనగ్నంగా కనిపించారు. జాతీయ పతాకాన్ని చేత పట్టుకున్న క్రీడాకారుడి ఫోజులో కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఏమైనా.. సినిమా ట్రైలర్ రిలీజ్ కు ఇస్తున్న ప్రయారిటీ చూస్తుంటే.. సినిమా విడుదల వేళ హడావుడి మరింత పీక్స్ కు చేరుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

The post ట్రైలర్ రిలీజ్ కే 75 అడుగుల కటౌటా? first appeared on namasteandhra.

Thanks! You've already liked this