లోక్ సభలో భరత్ ను ఏకేసిన రఘురామ

ఏపీలో జగన్ చేస్తున్న అప్పులు, వాటి కోసం పడుతున్న నానా తిప్పలు జాతీయ స్థాయిలో హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఇక, కార్పొరేషన్ల పేరుతో జగన్ నిధుల మళ్లింపులో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఇక, మద్యంపై భవిష్యత్తులో రాబోయే ఆదాయాన్ని చూపి కూడా జగన్ అప్పులు చేసిన వైనం చూసి ఆర్థిక నిపుణులే షాకవుతున్నారు. ఇలా అయితే, ఏపీ మరో శ్రీలంక కావడానికి ఎంతో కాలం పట్టదని అంటున్నారు.

మరి కొందరైతే, ఆల్రెడీ ఏపీ అప్పుల అగ్నిపర్వతం అని అది త్వరలోనే బద్దలై శ్రీలంక కన్నా దారుణ పరిస్థితులను ఆంధ్రా ప్రజలు ఫేస్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంటు వేదికగా జగన్ అప్పుల తిప్పల గుట్టును వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రట్టు చేశారు. ఆ సందర్భంగా ఎంపీ భరత్ వర్సెస్ రఘురామ ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో భాగంగా గురువారం లోక్ స‌భలో ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం జరిగింది. జగన్ సర్కార్ చేస్తున్న అప్పులు, నిధుల దారి మ‌ళ్లింపుపై ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఆధారాలు, గణాంకాలతో సహా వెల్లడించారు. మ‌ద్యంపై వస్తున్న ఆదాయాన్ని బేవ‌రేజెస్ కార్పొరేష‌న్‌కు జగన్ సర్కార్ దారి మ‌ళ్లిస్తోంద‌ని ఆయన ఆరోపించారు. ఖజానాలో జ‌మ కావాల్సిన సొమ్మును కార్పొరేష‌న్‌కు మ‌ళ్లించ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని స‌భ దృష్టికి తీసుకువ‌చ్చారు.  ఈ అంశంపై కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

అంతేకాదు, ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో శ్రీలంక త‌ర‌హా ఆర్థిక ప‌రిస్థితులున్నాయ‌ని కేంద్రం చెప్పిన అంశాన్ని కూడా రఘురామ ప్ర‌స్తావించారు. ఏపీ అప్పులపై కూడా కేంద్రం ఫోకస్ చేయాలని కోరారు. అయితే, తమ గుట్టురట్టు చేస్తున్న రఘురామను అడ్డుకునేందుకు ఎంపీ మార్గాని భ‌ర‌త్ ఆ ప్ర‌సంగానికి అడ్డు త‌గిలారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయొద్ద‌ంటూ రంకెలు వేశారు. ఆధారాలున్నాయని చెబుతున్న ర‌ఘురామ‌కు వ్య‌తిరేకంగా వైసీపీ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భ‌ర‌త్ వర్సెస్ రఘురామ మాటల యుద్ధం జరిగింది. చివరకు స్పీకర్ కలుగజేసుకొని వాగ్వాదానికి తెరదించారు.

The post లోక్ సభలో భరత్ ను ఏకేసిన రఘురామ first appeared on namasteandhra.

Thanks! You've already liked this