జగన్ కు తాజాగా చంద్రబాబు డెడ్లీ వార్నింగ్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీ నేత‌ల‌పైనా . చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జగన్ రెడ్డి అరాచకాలు ఇలానే కొనసాగిస్తే.. భూమి మీద ఎక్కడా తిరగలేడని, తిర‌గ‌కుండా చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చా రు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండో రోజు ఆయన పర్యటిస్తున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే.. వారి పోరాటానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందని, వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డాల‌ని ఆయన పిలుపునిచ్చారు.  బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని పాలకొల్లు నియోజకవర్గంలోని దొడ్డిపట్లలో వరద బాధితులను చంద్రబాబు పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ.. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. వరదల వల్ల సర్వస్వం కోల్పోయామని చంద్రబాబుకు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. తామే ఏటిగట్టు పరిరక్షించుకున్నామని చంద్రబాబుకు స్థానికులు వివరించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల కోసం పని చేసేది టీడీపీనేనని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో తుపానులు ఎక్కడ వస్తే అక్కడికే వెళ్లేవాడినని.. జగన్‌ మాత్రం జనాలను బురదలో ఉంచి గాలిలో తిరుగుతున్నారని విమర్శించారు. మానవత్వం లేని మనిషికి సీఎంగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పేదవాడి బాధలు తెలియని వ్యక్తి పదవిలో ఉండాలా అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తామని హెచ్చరించారు.

పేదవాడికి అండ.. తెలుగుదేశం పార్టీ జెండా అని చంద్ర‌బాబు కొనియాడారు. బాధితులకు న్యాయం చేసేవరకు పార్టీ వదలదని హెచ్చరించారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే.. వారి పోరాటానికి తెలుగుదేశం నాయకత్వం వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ప్రజలంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఈ ప్రభుత్వం పోలవరం పూర్తిచేసే పరిస్థితి లేదని.. అందుకే పోలవరం గోదావరి పాలైందని దుయ్య బట్టా రు. పోలవరం పూర్తయి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసాపురం ఎంపీని తన ప్రాంతానికి కూడా జగన్‌ రానివ్వట్లేదని.. రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కూడా జరిగిందని ఆరోపించారు. తప్పుడు పనులు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

The post జగన్ కు తాజాగా చంద్రబాబు డెడ్లీ వార్నింగ్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this