‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు ట్రైలర్ రిలీజ్

‘లాల్ సింగ్ చద్దా’ మూవీ తాలూకా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, నాగ చైతన్య లు నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆగస్టు 11 న తెలుగు , తమిళ్ . హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆస్కార్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. దీంతో చిరంజీవి తెలుగు కు సంబదించిన ప్రమోషన్ కార్య క్రమాలను జరుపుతున్నారు. ఇప్పటికే సినిమాలోని అమీర్ ఖాన్ , నాగ చైతన్య , కరీనా లుక్ లు రిలీజ్ అవ్వగా..తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ట్రైలర్ లో అమీర్ పాత్ర తీరుతెన్నులు ఆసక్తిని రేకెత్తించాయి. అసలు నడవగలడో లేదో తెలియని ఒక అమాయకుడైన బాలకుడు నడుస్తాడు.. పరిగెడుతాడు.. రేసులకు వెళతాడు.. చివరికి ఆర్మీలో యుద్ధ వీరుడిగా కనిపిస్తాడు.. ఇదంతా ఒక మిరాకిల్ అని అనిపిస్తుంది. అమ్మ చెబుతుండేది తలరాత ముందే రాసి ఉంటుందని..! ఎవరు రాసోరో ఎంత రాసారో అసలు ఎందుకు రాసారో ఇవన్నీ? అంటూ అమీర్ చెప్పే డైలాగ్ ఎంతో ఆలోచింపజేస్తుంది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్ కి ఇది అధికారిక రీమేక్. భారతదేశంలోని అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

The post ‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు ట్రైలర్ రిలీజ్ appeared first on Vaartha.

Thanks! You've already liked this