ప్రభాస్ కు ఫ్లాట్ అయిన బాలీవుడ్ బ్యూటీ

ప్ర‌భాస్‌.. ఈ పేరు తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఆయ‌న‌ను ద‌గ్గ‌ర నుండి చూసిన వారైనా, ఆయ‌న ఆతిధ్యాన్ని పొందిన వారైనా.. ప్ర‌భాస్ కు ఫిదా అవ్వ‌కుండా ఉండ‌లేరు. సౌత్ స్టార్స్ మాత్ర‌మే కాదు.. ఎంద‌రో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు సైతం ప్ర‌భాస్ వ్య‌క్తిత్వానికి, ఆతిధ్యానికి స‌లామ్ కొట్టారు. ఇక తాజాగా మ‌రో బాలీవుడ్ ముద్దుగుమ్మ సైతం ప్ర‌భాస్ కు ప‌డిపోయింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. హాట్ బ్యూటీ దిశా ప‌టాని.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వ‌చ్చిన `లోఫ‌ర్` సినిమాతో హీరోయిన్‌గా సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ భామ‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అన‌తి కాలంలోనే అక్క‌డ స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా హీరోయిన్ గా స‌త్తా చాటుతున్న దిశా ప‌టాని.. త్వ‌ర‌లోనే `ఏక్ విలన్ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది.

2014లో విడుదలైన `ఏక్‌ విలన్‌`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, దిశా పటాని, తారా సుతారియా ప్రధాన పాత్రల‌ను పోషించారు. టీ -సిరీస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం జూలై 29న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా దిశా ప‌టాని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా ఆమె సినిమాకు సంబంధించి ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకుంది. అలాగే ఈ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ ప్ర‌స్తావ‌న రాగా.. ఆయ‌న‌పై దిశా ప‌టాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించడం మీకు ఎలా అనిపించింది.. ?` అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా.. `నేను ఇప్పటివరకు పని చేసిన మంచి నటుల్లో ప్ర‌భాస్ ఒకరు.

అతను చాలా సింపుల్ గా ఉంటాడు. ఎలాంటి ఆర్భాటాల‌కు వెళ్ల‌డు. అంద‌రితోనూ ఒకేలా  ఉంటారు. ప్ర‌భాస్ తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం చాలా సుల‌భం. నా మొదటి రోజు షూట్ నాకు ఇప్పటికీ గుర్తుంది, ప్ర‌భాస్ నాకు త‌న ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకువ‌చ్చాడు. అలాగే టీమ్ మొత్తానికి కూడా ఆయ‌న ఇంటి నుండే ఫుడ్ వ‌చ్చింది.` అంటూ దిశా పటాని చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

కాగా, ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒక‌టి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ పాన్ వ‌రల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంటే.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నాడు. అలాగే మ‌రో కీ రోల్ కోసం దిశా ప‌టానీని ఎంపిక చేశారు.

The post ప్రభాస్ కు ఫ్లాట్ అయిన బాలీవుడ్ బ్యూటీ first appeared on namasteandhra.

Thanks! You've already liked this