3 నెలల్లో జగన్ చేసిన అప్పు చూసి కనకమేడల షాక్

ఏపీ అప్పులు…ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలోనే కాదు…దేశవ్యాప్తంగా ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, బీజేపీ పెద్దలు మొదలు ఆర్థిక నిపుణుల వరకు అందరూ ఏపీ అప్పులపై ఫోకస్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం లోక్ సభలో కార్పొరేషన్లు, మద్యంపై వచ్చే ఆదాయం నుంచి కూడా జగన్ అప్పులు తీసుకుంటున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.

ఇక, తాజాగా ఏపీ అప్పులపై రాజ్య సభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సంచలన విషయాలు రాబట్టారు. కనకమేడల అడిగిన ప్రశ్నకు  కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి పంక‌జ్ చౌద‌రి లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. అప్పు పుట్టిన ప్ర‌తి చోటా జగన్ సర్కార్ రుణాలు తీసుకుంటోంద‌ని, ఈ ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తానికి అనుమ‌తించిన రుణాల్లో స‌గానికి పైగా రుణాల‌ను జగన్ ప్ర‌భుత్వం తొలి 3 నెల‌ల్లోనే సేక‌రించింద‌ని సంచలన విషయాలు వెల్లడించారు.

2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి నిక‌ర రుణ ప‌రిమితి కింద ఏపీకి రూ.44,574 కోట్ల రుణాల‌కు కేంద్రం అనుమ‌తించిందని ఆయన సభకు చెప్పారు. మొద‌టి 9 నెల‌ల‌కు గాను రూ.40,803 కోట్ల రుణం తీసుకునే అనుమ‌తి ఉంద‌ని, కానీ, తొలి 3 నెల‌ల్లోనే ఏపీ ప్ర‌భుత్వం 50 శాతానికి మించి అప్పులు తీసుకుంద‌ని షాకింగ్ విషయాలు వెల్లడించారు. అంతేకాదు, ఏప్రిల్ నెల పూర్త‌య్యేనాటికే… అంటే ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభమైన తొలి నెల‌లోనే రూ.21,890 కోట్ల రుణాన్ని తీసుకుందని చెప్పడంతో సభికులంతా షాకయ్యారు.

కాగా, గతంలో జరిగిన రాజ్య‌స‌భ స‌మావేశాల్లో ఏపీ ఆర్థిక దుస్థితిని టీడీపీ ఎంపీ క‌న‌కమేడ‌ల ర‌వీంద్ర కుమార్‌ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఆర్ధిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించాలని, ఆర్టిక‌ల్- 360ని ప్ర‌యోగించాలని, శాస‌న స‌భ ఆమోదం లేకుండా రూ.1.11 ల‌క్ష‌ల కోట్ల‌ను ఖ‌ర్చు చేశారని కనకమేడల ఆరోపించారు. సుమారు రూ.48 వేల కోట్ల‌కు లెక్క‌లు చూప‌డం లేదని, కోర్టుల తీర్పుల‌పై స‌భ‌లో చ‌ర్చ‌లు పెడుతున్నారని కనకమేడల జగన్ పరువును పెద్దల సభలో తీశారు.

The post 3 నెలల్లో జగన్ చేసిన అప్పు చూసి కనకమేడల షాక్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this