సాయిరెడ్డి పరువు తీసిన బుద్ధా వెంకన్న

వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంక‌న్న కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి, బుద్ధా వెంకన్న మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా, విజయసాయిపై బుద్ధా వెంకన్న సంచలన ట్వీట్ చేశారు. ఇంతవరకు విజయసాయిరెడ్డికి బుర్ర అరికాల్లో ఉందన్న అనుమానం ఉండేదని, విశాఖ ఆదాయంపై విజయసాయి చేసిన ట్వీట్ చూశాక ఆయన బుర్ర తక్కువవాడని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.

విశాఖ అభివృద్ధిపై టీడీపీ దృష్టి పెట్టి ఉంటే జాతీయస్థాయిలో ఐదో స్థానంలో ఉండేదని, వైసీపీ వచ్చాక విశాఖ అభివృద్ధి పథంలో
దూసుకుపోతోందంటూ విజయసాయి చేసిన ట్వీట్ కు బుద్ధా స్పందించారు. 2016-17లోనే విశాఖ జీడీపీ 43.5 బిలియన్లుగా ఉందని బుద్ధా గణాంకాలతో సహా వెల్లడించారు. “ఇప్పుడున్న ద్రవ్యోల్బణంతో లెక్కిస్తే… మీరు పెంచినట్టా, తగ్గించినట్టా అనేది నీ దొంగ సీఏ మెదడుతో ఆలోచించు” అంటూ విజయసాయికి బుద్ధా చురకలంటించారు.

కాగా, గతంలో కూడా సాయిరెడ్డిపై బుద్ధా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. మేం ఎన్నికల్లో సోలో ఫైట్ చేస్తామన్న సాయిరెడ్డిపై సోది క‌బుర్లు ఎందుకంటూ బుద్ధా వెంకన్న చురకలంటించారు. జగన్ రెడ్డి సోలో ఫైట్ మాట దేవుడెరుగు.. కుటుంబ సభ్యులు, సొంత చెల్లి, తల్లి ఛీ కొట్టిన జగన్ సోలోగా మిగిలిపోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో వైసీపీ పొత్తుపై పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రకటన తర్వాత కూడా సోలో ఫైట్ ఏంటని పంచ్ లు వేశారు.

జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ లాస్ట్ అని, మళ్లీ ఓటేసేదేలే అని జనాలు అంటున్నారని సెటైర్లు వేశారు బుద్ధా. ఇక, ఉత్తరాంధ్రలో 34 సీట్లకుగాను టీడీపీకి 28 వస్తాయని పీకే టీం సర్వేలో తేలిందని, జగన్ పతనం ఉత్తరాంధ్ర నుంచే మొదలవుతుందని బుద్ధా వెంకన్న చెప్పిన సంగతి తెలిసిందే.

The post సాయిరెడ్డి పరువు తీసిన బుద్ధా వెంకన్న first appeared on namasteandhra.

Thanks! You've already liked this