అమ‌రావ‌తి ఉద్య‌మానికి కొత్త‌రూపం.. ఈ రోజు నుంచే

సుమారు రెండేళ్లకుపైగానే సాగుతున్న అమ‌రావ‌తి ఉద్య‌మం.. అంద‌రికీ తెలిసిందే. ఏపీ రాజ‌ధాని అమ‌రావ తిని కాద‌ని.. మూడు రాజ‌ధానులు అంటూ.. కొత్త పాట పాడిన వైసీపీ స‌ర్కారుపై స‌మ‌ర శంఖం పూరించిన రైత‌న్న‌లు.. రెండేళ్ల‌పైగానే.. ఈ ఉద్య‌మాన్ని బ‌హుముఖాలుగా ముందుకు తీసుకువెళ్తున్నారు.

న్యాయ‌పోరాటం చేశారు. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. నిరాహార దీక్ష‌లు చేశారు. నిరంత‌రం.. ఏదో ఒక రూపంలో ఉద్య‌మాలు కొన‌సాగించారు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు.. ఈ ఉద్య‌మాన్ని తీసుకువెళ్లారు.

ఇక‌, తిరుమ‌ల‌కు పాద‌యాత్ర చేశారు. అఖండ ప్ర‌జానీకాన్నీ.. క‌దిలించి.. రాజ‌ధాని ప్రాధాన్యాన్ని తెర‌మీదికి తెచ్చి.. ప్ర‌తి ఒక్క‌రినీ ముందుకు వ‌చ్చేలా చేశారు. హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో(ఎట్టి ప‌రిస్థితిలోనూ.. అమ‌రా వ‌తిలో నిర్మాణాలు సాగించాల‌ని.. రైతుల‌తో చేసుకున్న ఒప్పందాల‌ను తోసిపుచ్చ‌డానికి వీలు లేద‌ని.. వారికి ఇస్తామ‌న్నవి ఇవ్వాల‌ని.. కోర్టు తేల్చి చెప్పింది)  ఒకింత ఉద్య‌మం వేడిత‌గ్గింద‌నే భావ‌న వ్య‌క్త‌మైంది. నిజ‌మే.. హైకోర్టు ఉంద‌నే ఉద్దేశంతో వారికి ధైర్యం వ‌చ్చింది.

అయితే.. హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చి కూడా.. నెల‌లు గ‌డుస్తున్నా.. ప్ర‌భుత్వంలో ఇంకా చ‌ల‌నం లేక పోవ‌డంతో.. మ‌రోసారి.. రైతులు ఉద్య‌మానికి రెడీ అయ్యారు.  ‘మనం-మన అమరావతి’ పేరుతో పాదయాత్ర చేప‌ట్టారు. శుక్ర‌వారం నుంచి(శ్రావ‌ణ మాసం సంద‌ర్భంగా ప్రారంభించారు) ఆగష్టు 4వ తేదీ వరకు రాజధాని గ్రామాల్లో నేతలు పాదయాత్ర చేయనున్నారు. మొదటి రోజు పాదయాత్ర ఉండవల్లి నుంచి పెనుమాక, కృష్ణాయపాలెం, యర్రబాలెం వరకు కొనసాగనుంది.

అయితే.. రైతుల పాద‌యాత్ర‌ను చిత్రంగా బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. సోము వీర్రాజు ప్రారంభించారు. రైతుల‌తో క‌లిసి.. ఆయ‌న రెండు గ్రామాల వ‌ర‌కు పాదయాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుంటే రాజధాని ఎందుకు కట్టడంలేదని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేశారని, ఇందుకు వైసీపీనే  కారణమేనని సోము వీర్రాజు ఆరోపించారు. వెంకయ్యనాయుడు రాజధాని కోసం రూ.2,500 కోట్లు నిధులు ఇప్పించారని… రాజధాని కుట్టకుండా  రైతులను మోసం చేశార‌న్నారు.

అమరావతిలో నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సోమువీర్రాజు డిమాండ్‌చేశారు. రాజధాని కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కాగా, తాజాగా ప్రారంభించిన రైతు పాద‌యాత్ర‌కు భారీ స్పంద‌న ల‌భించ‌డం గ‌మ‌నార్హం.

The post అమ‌రావ‌తి ఉద్య‌మానికి కొత్త‌రూపం.. ఈ రోజు నుంచే first appeared on namasteandhra.

Thanks! You've already liked this