స్కార్పియో సంచలనం.. అరగంటలో లక్ష బుకింగ్స్!

ఇటీవల కాలంలో మాంచి జోరు మీద ఉన్న మహీంద్రా మహీంద్రా వాహన సంస్థ.. తాజాగా మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది. శనివారం ఈ సంస్థకు చెందిన సరికొత్త వాహనం స్కార్పియో-ఎన్  (కొత్త మోడల్) బుకింగ్స్ చేపట్టారు.

ఆన్ లైన్ లో బుకింగ్స్ ను షురూ చేసిన మొదటి నిమిషయంలో ఏకంగా 25 వేల వాహనాల బుకింగ్స్ చేపట్టటం సంచలనంగా మారింది. సరికొత్త డిజైన్ లో చూసినంతనే ఆకట్టుకునేలా ఉండే ఈ వాహనంపై కొద్ది రోజులుగా మార్కెట్లో మాంచి బజ్ ఉంది.

ఈ వాహన బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా? అని ఎదురుచూసిన వారంతా.. భారీగా బుకింగ్స్ కావటాన్ని సంస్థ ప్రతినిధులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. శనివారం ఉదయం సరిగ్గా 11 గంటలకు మొదలైన బుకింగ్స్ కేవలం అరగంటలోనే లక్ష బుకింగ్స్ దాటిపోవటం.. బుకింగ్ చేసుకున్న వారు అడ్వాన్సు రూపంలో డబ్బులు చెల్లించారు. శనివారం నమోదైన బుకింగ్స్ విలువ రూ.18వేల కోట్లుగా ఉంటాయని చెబుతున్నారు.

తాజా బుకింగ్స్ వాహన మార్కెట్లో సరికొత్త రికార్డుగా అభివర్ణిస్తున్నారు. తాజాగా బుకింగ్స్ చేసుకున్న వారికి ఈ ఏడాది సెప్టెంబరు 26 నుంచి డెలివరీలు ఇవ్వనున్నారు. ఇప్పుడు బుకింగ్స్ చేసుకున్న వారికి ఏడాది చివరి నాటికి డెలివరీలు పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వాహనం విలువ దగ్గర దగ్గర రూ.22 లక్షల (హైఎండ్) వరకు ఉంటుందని చెబుతున్నారు.

The post స్కార్పియో సంచలనం.. అరగంటలో లక్ష బుకింగ్స్! first appeared on namasteandhra.

Thanks! You've already liked this