దరిద్రుడి పాలనలో ‘భారతి’ రాజ్యాంగం

‘మనం మన అమరావతి’ పేరుతో బీజేపీ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అమరావతి చుట్టుపక్కల గ్రామాలను కవర్ చేసేలా ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్ పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దరిద్రుడు రావడం వల్ల అమరావతి ఆగిపోయిందని, రాష్ట్రానికి పట్టిన ఈ దరిద్రం పోవాలని జగన్ ను ఉద్దేశించి ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.

వందమంది రాజారెడ్లు కలిస్తే ఒక్క జగన్‌ అని, ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా ‘భారతి’ రాజ్యాంగం అమలులో ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాలంలో రాజధాని అభివృద్ధి శర వేగంగా జరిగిందని, 2019లో ఆయన సీఎం అయ్యుంటే‘నూరుశాతం పూర్తయ్యేదని అన్నారు. జగన్ ను చాలామంది రాక్షసుడితో పోలుస్తున్నారని, జగన్ నూరుమంది రాక్షసుల కలయిక అని అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజుకంటే మూర్ఖుడు బలవంతుడంటారని, అదే మూర్ఖుడు రాజైతే రాష్ట్రం ఇలా ఉంటుందని విమర్శలు గుప్పించారు. ఈ మూర్ఖుడిపై కొరఢా ఝుళిపించక తప్పదని, ఆ బాధ్యత బీజేపీపైనే ఉందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. అయితే, ఇన్నాళ్లూ అమరావతిపై నోరు మెదపని బీజేపీ నేతలు ఇప్పుడు పాదయాత్ర చేయడం ఏమిటని కొందరు రైతులు ప్రశ్నించారు. రౌడీ పాలనకు ఇన్నాళ్లూ బీజేపీ మద్దతు పలికిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

The post దరిద్రుడి పాలనలో ‘భారతి’ రాజ్యాంగం first appeared on namasteandhra.

Thanks! You've already liked this