‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ..మంట పుట్టిందట

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ తెరకెక్కించిన భారీ చిత్రం ‘బింబిసార’. ఆగస్టు 5న ఈ సోషియో ఫాంటసీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ.కె నిర్మించారు.  ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ ఫాంటసీ యాక్షన్ మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రంతో కల్యాణ్ రామ్ హిట్ కొడతారని నందమూరి అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అయితే, వారి అంచనాలకు తగ్గట్లుగానే సినిమా బాగుందంటూ విదేశీ సెన్సార్ బోర్డు సభ్యుడు, ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధూ బింబిసార చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. భారీ బడ్జెట్ చిత్రం ‘బింబిసార’పై సంధూ తన మార్క్ రివ్యూనిచ్చారు. సెన్సార్ బోర్డు సభ్యుడైలన సంధూ ‘బింబిసార’ విడుదలకు ముందే తన అభిప్రాయాన్ని ట్విటర్ లో షేర్ చేశారు. ‘బింబిసార’ చిత్రాన్ని చూశానని, చాలా బాగుందని సంధూ ప్రశంసించారు.

తెలుగు సినిమా మళ్లీ పుంజుకుంటోందని, ‘సీతారామం’ చిత్రం కూడా బాగుందని సంధూ అన్నారు. అంతేకాదు, తన ట్వీట్ కు చివరన లవ్, ఫైర్ ఎమోజీలను సంధు పెట్టడంతో బింబిసార సినిమా మంటపుట్టించిందని నందమూరి అభిమానులు అంటున్నారు. బింబిసార, సీతారామం చిత్రాలు ఒకే రోజున విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అందుకే, ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాలని బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూ.ఎన్టీఆర్ అన్నారు.

మరోవైపు, ‘బింబిసార’ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది. రాష్ట్రం నలుమూలలా ‘బింబిసార’ కాంటర్ వాహనాలు సందడి చేస్తున్నాయి. విశాఖపట్నం, సమిస్రగూడెం, కాకినాడ, నందమూరు ప్రాంతాల్లో ఆ వాహనాలు భారీ స్క్రీన్ల ద్వారా ‘బింబిసార’ ట్రైలర్, ఇతర క్లిప్పింగ్స్ ను ప్రదర్శిస్తున్నాయి. ఇక, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తాను తెరకెక్కించిన ఈ సినిమా ఓ కొత్త అనుభూతినిస్తుందని దర్శకుడు వశిష్ఠ అంటున్నారు.

The post ‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ..మంట పుట్టిందట first appeared on namasteandhra.

Thanks! You've already liked this