సెక్సు లైఫ్ గురించి అమీర్ ఖాన్…షాకింగ్ ఆన్సర్

వీలైనంత స్పెసీగా ప్రశ్నలు సంధించటం.. ఎదుటోళ్ల నుంచి వచ్చే సమాధానాలతో తన కాఫీ విత్ కరణ్ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయల మాదిరి చేసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ నిర్మాత కమ్ డైరెక్టర్ కు అసలుసిసలు పంచ్ పడింది. తాజాగా కాఫీ విత్ కరణ్ సీజన్ 7ను మహా జోరుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తరచూ వార్తల్లో ఉండే వారిని తన షోకు పిలిపించి.. ఇష్టారాజ్యంగా అడిగే ప్రశ్నలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రెకేత్తించే టెక్నిక్ కరణ్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో?

తాజాగా విడుదల అవుతున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో హీరోహీరోయిన్లుగా వ్యవహరిస్తున్న అమిర్ ఖాన్.. కరీనా కపూర్ లతో చేసిన షోకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో కరణ్ ను అమీర్ ఆడుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. అన్నింటికి మించి.. పిల్లలు పుట్టిన తర్వాత క్వాలిటీ సెక్సు అన్నది నిజమా? అబద్ధమా? అని  కరణ్ ప్రశ్నిస్తే.. మీకు తెలీదా? అంటూ కరీనా పంచ్ విసిరితే.. దానికి కరణ్ బదులిస్తూ.. తన తల్లి ఈ షో చూస్తారని.. ఇలా తన సెక్సు లైఫ్ గురించి మాట్లాడటం బాగోదని బదులిచ్చాడు.

ఇక్కడే భలేగా అందుకున్న అమీర్ ఖాన్.. ‘ఇతరుల సెక్సు లైఫ్ గురించి మీరు మాట్లాడటాన్ని మీ అమ్మ పట్టించుకోవటం లేదా?’ అంటూ నవ్వుతూ గడ్డి పెట్టేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఎదుటోళ్ల జీవితం తన వ్యాపారానికి ముడి సరుకుగా ఫీలయ్యే కరణ్ లాంటి వాడికి.. అమీర్ ఖాన్ భలేగా గడ్డి పెట్టారని చెప్పక తప్పదు. ఏమైనా.. ఈ ఎపిసోడ్ ప్రోమోను చూసినప్పుడు.. మిగిలిన వాటి మాదిరే ఆసక్తికరంగా మలిచిన ఫీలింగ్ కలుగక మానదు.

The post సెక్సు లైఫ్ గురించి అమీర్ ఖాన్…షాకింగ్ ఆన్సర్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this