జేబులో చిల్లిగ‌వ్వ లేక అప్పు చేసిన ప్ర‌భాస్‌

`బాహుబ‌లి` సినిమాతో ఇండియా వైడ్ గా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం పాన్ ఇండియా చిత్రాలే కాదు పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే వంద కోట్ల‌కు పైగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటూ తోటి హీరోల‌కు దిమ్మతిరిగేలా చేస్తున్నాడు. అలాంటి ప్ర‌భాస్ కు జేబులో చిల్లిగ‌వ్వ లేక ఓ డైరెక్ట‌ర్ వ‌ద్ద అప్పు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇంత‌కీ డార్లింగ్ ఎంత అప్పు చేశాడో తెలుసా.. రూ.100. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

మ‌ల‌యాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా టాలీవుడ్ డైరెక్ట‌ర్ హను రాఘవపూడి తెర‌కెక్కించిన తాజా చిత్రం `సీతా రామం`. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యాన‌ర్ పై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తే.. ర‌ష్మిక మంద‌న్నా ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. సుమంత్‌, భూమిక‌, తరుణ్ భాస్కర్ లు కూడా ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించ‌బోతున్నారు.

హై బ‌డ్జెట్ తో ఓ అద్భుత‌మైన ప్రేమ క‌థ‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 5న తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ముస్తాబ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆగ‌స్టు 3 సాయంత్రం `సీతా రామం` ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేశారు.

ప్రభాస్‌ చాలా రోజుల తర్వాత ఇలా బ‌య‌ట క‌నిపించ‌డంతో.. ఆయ‌న్ను చూసి అభిమానులు తెగ మురిసిపోయారు. ఇక ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ `సీతా రామం` టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. `సీతారామం సినిమాని థియేటర్ లోనే చూడాలి. ఇంట్లో దేవుడు ఉన్నాడని గుడికి వెళ్లడం మానేస్తామా? ఇది అంతే. మా సినీ ఫీల్డ్‌కు థియేటర్సే దేవలయాలు. తప్పకుండా సినిమాని థియేటర్ లో చూడండి` అంటూ త‌న‌ వ్యాఖ్య‌ల‌తో ఈ మూవీపై మ‌రింత హైప్ ను క్రియేట్ చేశారు.

అలాగే చివ‌ర్లో `సీతా రామం` మొదటి టికెట్ మీరే కొనబోతున్నారని యాంక‌ర్ సుమ చెప్ప‌డంతో.. `నా జేబులో డబ్బులు లేవు. ఇందాక నాగ్ అశ్విన్‌ వద్ద రూ. 100 అప్పుగా తీసుకున్నా` అని చెప్పి ప్ర‌భాస్ న‌వ్వులు పూయించాడు. ఈ క్ర‌మంలోనే రూ. 100 పెట్టి అశ్వనిదత్‌ వద్ద టికెట్ ను కొనుగోలు చేశారు. ఇక ఈ సంద‌ర్భంగా సీతారామం టికెట్ ధరలు పెంచడం లేదని.. సింగల్ స్క్రీన్‌లో వంద‌ రూపాయిలు, మల్టీప్లెక్స్‌లో 150 రూపాయలకు మాత్ర‌మే టికెట్లు అందుబాటులో ఉంటాయని చిత్ర యూనిట్ పేర్కొంది.

The post జేబులో చిల్లిగ‌వ్వ లేక అప్పు చేసిన ప్ర‌భాస్‌ first appeared on namasteandhra.

Thanks! You've already liked this