ఆగస్టు 7 నుంచి 9 వరకు భారీ వర్షాలు : ఐఎండీ

భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 7 నుంచి 9 వరకు పశ్చిమ, మధ్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ తుఫాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ‘ఆరెంజ్‌’ అలర్ట్‌ జారీ చేసింది. రుతుపవన ద్రోణి చురుకుగా సాగుతోంది. దాని ప్రభావం దక్షిణంగా రాబోయే 4-5 రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య, పశ్చిమ మధ్యకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వాయువ్య దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌, రాయలసీమ, తెలంగాణ, కోస్తా మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, యానాం, కేరళ, మాహేలలో ఆగస్టు 9 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చిరించింది.

The post ఆగస్టు 7 నుంచి 9 వరకు భారీ వర్షాలు : ఐఎండీ appeared first on విశాలాంధ్ర.

Thanks! You've already liked this