దిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢల్లీికి వెళ్లనున్నారు. 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం నుంచి విమానంలో దిల్ల్లీకి బయలుదేరుతారు. రాత్రికి వన్‌ జన్‌పథ్‌లో బస చేసి, 7వ తేదీ (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌ చేరుకుంటారు. ఆ తర్వాత నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడ జరిగే నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఏడవ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. కాగా.. సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస జూనియర్‌ కాలేజీ మైదానంలో జరగనున్న శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు.

The post దిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ appeared first on విశాలాంధ్ర.

Thanks! You've already liked this