7న హైదరాబాద్‌లో మొత్తం ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలలో తిరిగే పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మొత్తం 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేస్తూ ద.మ.రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7వ తేదీన హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేసినట్లు ముందుగానే ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్‌ ప్రాబ్లెమ్‌ కారణంగా ఇటీవల ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 7న ఆదివారం నాడు ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసు ప్రయాణికులు, ప్రత్యామ్నాయం ఎంచుకుని ప్రయాణం చేయాలని సూచించారు. లేకపోతే రెగ్యూలర్‌ ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు ఇబ్బంది పడతారని భావించి, దక్షిణ మధ్య రైల్వే రేపు అన్ని ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చింది. లింగంపల్లి – హైదరాబాద్‌ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్‌ – లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా – లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి – ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి – సికింద్రాబాద్‌ మార్గంలో 1 సర్వీసు, సికింద్రాబాద్‌ – లింగంపల్లి మార్గంలో 1 సర్వీసు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడిరచింది.

The post 7న హైదరాబాద్‌లో మొత్తం ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు appeared first on విశాలాంధ్ర.

Thanks! You've already liked this