గుట్కా గుట్టు ర‌ట్టు.. భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల స్వాధీనం..

బీదర్ నుంచి వినుకొండకు అక్రమంగా తరలిస్తున్న గుట్కా బస్తాలు, మద్యం సీసాలు పిడుగురాళ్ల ఎస్ ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు రూ.30 లక్షల విలువైన గుట్కా, ఖైని మద్యం సీజ్ చేసి.. ఐషర్ వాహనం, ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుట్కా, మద్యం అక్రమ రవాణాకు సూత్ర దారుడు శావల్యాపురం మండలం వేల్పూరు వాసిగా సమాచారం. వివ‌రాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల (కొండమూడు జంక్షన్ వద్ద) సమీపంలో ఐషర్ వాహనంలో కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి వినుకొండకు అక్రమంగా తరలిస్తున్నారు.

సుమారు రూ.30 లక్షల విలువైన గుట్కా బస్తాలు, మద్యం సీసాలు లను పట్టుకున్న ఎస్ ఈబీ అధికారులు, పల్నాడు జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ అధికారులకు వచ్చిన సమాచారం నేపధ్యంలో కొండమూడు జంక్షన్ వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తున్న ఐషర్ వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించగా ఆ వాహనంలో సగభాగం వరకు సీక్రెట్ గా క్యాబిన్ తయారీ చేసి అందులో నిషేధత గుట్కా, ఖైని, మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి లారీలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన పారా లింగారావు తమ చేత అక్రమ రవాణా చేయిస్తున్నాడని తెలిపారు. ఇతనిపై వినుకొండ, శావల్యాపురం, పిడుగురాళ్లతో సహ పలు ప్రాంతాల్లో అక్రమ గుట్కా రవాణా కేసులు నమోదు అయినట్లు సమాచారం. ఉందని పలుమార్లు కేసులు నమోదు చేసినా అతనిలో ఎటువంటి మార్పు రాలేదని పదేపదే ఇతర రాష్ట్రాల నుంచి గుట్కా, ఖైని లను అక్రమ రవాణా చేస్తున్న సంఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎస్ ఈబీ ఇన్స్పెక్టర్ తెలిపారు.

Thanks! You've already liked this