గోరంట్ల వీడియోకు సాయిరెడ్డి స(సె)క్సెస్ మీట్

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ ఇపుడు జాతీయవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఒక ఎంపీ అయి ఉండి ఇదేం పాడుపని అంటూ మాధవ్ పై మహిళా సంఘాలు మొదలు మహిళా ఎంపీల వరకు అంతా దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, ఇంత జరుగుతున్నా సరే..మాధవ్ విషయంలో వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఆ వీడియో నిజమని తేలితే మాధవ్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పైపైకి చెబుతున్న వైసీపీ నేతలు…తాజాగా మాధవ్ తో కలిసిమెలిసి బర్త్ డే పార్టీలు చేసుకుంటున్న వైనం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా పార్టీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన వైసీపీ ఎంపీలతో పాటు గోరంట్ల మాధవ్ కూడా వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, అక్కడ ఓ ఎంపీ బర్త్ డే వేడుకలో కూడా మాధవ్ చిరునవ్వులు చిందిస్తూ పాల్గొన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో, మాధవ్ తో పాటు వైసీపీ ఎంపీలు, జగన్ పై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. దేశం సిగ్గు పడే పని చేసిన గోరంట్ల మాధవ్ ని సస్పెండ్ చేస్తున్నామని లీకులు ఇచ్చిన వైసీపీ నేతలు…ఢిల్లీలో పార్టీ సమావేశాలకు పిలిచి ప్రత్యేకంగా కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టారని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

అధికారంలో ఉన్న పార్టీ ఎంపీకి చెందిన వీడియోను ధైర్యం చేసి బాధితురాలు బయట పెట్టిందని, అంటే మాధవ్ ఆ మహిళను ఎంత వేధించి ఉంటాడో అర్థం చేసుకోవాలని దుయ్యబడుతున్నారు. చీటికి మాటికి టీడీపీ నేతలపై చెత్త ట్వీట్లు పెట్టే విజయసాయి ఇప్పుడు “ఢిల్లీలో బట్టలిప్పుకొని పోరాడుతున్న మా ఎంపీ” అని ట్వీట్లు పెట్టు అంటూ మండిపడుతున్నారు. మీవి నవరత్నాలు కాదు న్యూడ్ రత్నాలు..అంటూ అవంతి, అంబటి, మాధవ్ లనుద్దేశించి ట్రోల్ చేస్తున్నారు.

‘‘ఏం చేస్తాం… ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అంతే! సిగ్గు వాళ్ళకి లేదా ? మనకి లేదా ? గలీజు వీడియోని గల్లీ గల్లీలో చూసి జనం ఉమ్మేస్తున్నా.. వీళ్లకు చీమకుట్టినట్టు లేదు. కట్ చేయాల్సింది కట్ చేయకుండా ఈ కేక్ కట్టింగ్ లు ఏంటి ఏ-2 విసారెడ్డీ? మిమ్మల్ని చూస్తుంటే నిన్నటి గలీజు వీడియోకి సెక్సెస్ (సక్సెస్) మీట్ జరుపుకుంటున్నట్టు ఉంది’’అంటూ విజయసాయిరెడ్డిపై ట్రోల్ ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక, ఈ రాసలీలల వైసీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకునే విషయంలో జగన్ రెడ్డి మీనమేషాలు లెక్కపెడుతున్నారని, దీనిని బట్టి ఈ ప్రభుత్వం మహిళలకిస్తున్న ప్రాధాన్యత ఎలాంటిదో అర్థవుతోందని జగన్ ను ఏకిపారేస్తున్నారు. గతంలోనే అంబటి, అవంతిలపై చర్య తీసుకొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు కదా జగన్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, మరియు తెలుగు మహిళ నేతలు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ దిష్టిబొమ్మను చీపుర్లతో కొట్టి తగలబెట్టారు. వైసీపీ అంటేనే అశ్లీల కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శలు గుప్పించారు. ఇక, #YcpMpDirtyPicture, #YCPMPsexScandal, #WhoRemovedLungi అనే హ్యాష్ ట్యాగ్ లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

The post గోరంట్ల వీడియోకు సాయిరెడ్డి స(సె)క్సెస్ మీట్ first appeared on namasteandhra.

Thanks! You've already liked this